E.G: రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను సోమవారం అందజేశారు. రాజానగరం మండలం కొత్త తుంగపాడు గ్రామానికి చెందిన పలువురికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను భారతీయ జనతా పార్టీ రాజమహేంద్రవరం పార్టీ కార్యాలయంలో నూతనంగా మంజూరైన బాధితులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఆమె అందజేశారు. ఈ కార్యక్రమంలో తుంగపాడు గ్రామ నాయకులు పాల్గొన్నారు.