HYD: బీసీ సంక్షేమ సంఘం యువజన విభాగం తెలంగాణ రాష్ట్ర కార్య నిర్వహక అధ్యక్షుడిగా పీ.కార్తీక్ పటేల్ నియమితులయారు. ఈ మేరకు కార్తీక్ పటేలు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య నియామక పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో బీసీ నేతలు డా. ర్యాగ అరుణ్ కుమార్, జిల్లపల్లి అంజి, గవ్వల భరత్ కుమార్, కంచిగారి ప్రవీణ్ కుమార్, నీల వెంకటేష్ ఉన్నారు.