వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని జర్నలిస్టుల కోసం నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లను అర్హులైన జర్నలిస్టులకు పంపిణీ చేయాలని మంత్రి కొండా సురేఖ-మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ దంపతులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు ముందుగా జర్నలిస్టుల సమక్షంలో ప్రకటించిన నియమ నిబంధనల ప్రకారం నాలుగు జర్నలిస్టు యూనియన్ల ప్రతినిధులు సమన్వయంతో అర్హుల జాబితాను రూపొందించారు.