EG: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు ప్రతిష్టాత్మక డీజీపీ కమెండేషన్ డిస్క్ అవార్డ్కు గోకవరం పోలీసు స్టేషన్ కానిస్టేబుల్ ఆర్.నరేష్ ఎంపికైనట్లు ఎస్సై వి.ఎన్.వి. పవన్ కుమార్ సోమవారం తెలిపారు. పోలీసు శాఖలో వివిధ విభాగాల్లో అందించే ఈ అవార్డులను 2025 సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ సోమవారం ప్రకటించినట్లు తెలిపారు.