నిజామాబాద్లో 9 నెలల బాబును విక్రయించిన సంఘటన తెలిసిందే. ఈ సంఘటనలో ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు పట్టణ వన్ టౌన్ SHO రఘుపతి తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు.. కామారెడ్డికి చెందిన సీమ, షరీఫ్ NZB రైల్వే స్టేషన్ వద్ద 9నెలల బాబుతో భిక్షాటన చేస్తూ బాబును విక్రయించారు. వారిద్దరితో పాటు మధ్యవర్తులుగా ఉండి బాబును విక్రయించిన రెహనా, సర్ తాజ్ అన్సారీ, సలావుద్దీన్ ఖురేషీని అరెస్ట్ చేశారు.