విజయనగరం కలెక్టరేట్ ఆడిటోరియంలో ఇవాళ పీజీఆర్ఎస్ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉంటారన్నారు. ప్రజలు తమ సమస్యలపై అర్జీలు సమర్పించి, పాత అర్జీల స్లిప్పులు తీసుకురావాలని సూచించారు. మండలాలు, మున్సిపాలిటీల్లో కూడా పీజీఆర్ఎస్ జరుగుతుందని చెప్పారు.