HYD: ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న 38వ బుక్ ఫెయిర్ సందర్శకులతో కిటకిటలాడుతోంది. నిత్యం స్మార్ట్ఫోన్లలో రీల్స్‌తో బిజీగా ఉండే యువత, ఈసారి పెద్ద సంఖ్యలో పుస్తక ప్రదర్శనకు తరలిరావడం విశేషం. నిన్న సెలవురోజు కావడంతో కుటుంబ సమేతంగా వచ్చిన నగరవాసులు తమ చిన్నారుల కోసం కామిక్స్, యాక్టివిటీ పుస్తకాలను ఉత్సాహంగా కొనుగోలు చేశారు.