SKLM: ఆమదాలవలస M తాళ్లవలస వద్ద ఆదివారం నడుస్తున్న ఓ ప్రైవేటు బస్సు చక్రం ఊడిపోయినట్లు స్థానికులు తెలిపారు. కొంత దూరం రోడ్డును రాసుకుంటూ వెళ్లి బస్సు ఆగిపోయిందని వారు పేర్కొన్నారు. బస్సులో విద్యార్థులు, ఎదురుగా వాహనాలు మనుషులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందన్నారు. బస్సుల నిర్వహణలో నిర్లక్ష్యం చూపితే ఇలాంటి ప్రమాదాలే జరుగుతాయని ఇప్పటికైనా అధికారులు పక్కాగా తనిఖీలు చేయాలని స్థానికులు కోరారు.