BPT: కొల్లూరు మండలంలోని కేటీ కాలనీ-క్రాప వెళ్లే రహదారి గుంతలు ఏర్పడి అధ్వానంగా మారింది. పలువురు క్రాప నుంచి కొల్లూరు వెళ్లేందుకు ఈ మార్గం మీదుగా వెళ్తుంటారు. గోతులమయం కావడంతో రాకపోకలకు ఇబ్బంది పడుతున్నట్లు చోదకులు చెబుతున్నారు. మరమ్మతులు చేపట్టి దారి కష్టాలను తీర్చాలని వాహనదారులు కోరుతున్నారు.