WGL: నల్లబెల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో ఇవాళ విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వ్యవసాయ అధికారి (ఏవో) రజిత మాట్లాడుతూ.. మండలంలోని సహకార సొసైటీలో ప్రస్తుతం 20 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని తెలిపారు. రైతులు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని ఆమె పేర్కొన్నారు. టోకెన్ తీసుకొని యూరియా విక్రయించాల్సిందిగా సూచించారు.