ELR: జీలుగుమిల్లి మండలం కామయ్యపాలెం గ్రామంలో ఇవాళ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు నాటుసారా స్థావరాలపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో నాటు సారా తయారీకి ఉపయోగించే 200 లీటర్ల బెల్లపు ఊటను స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు. అలాగే ఇద్దరు వ్యక్తులపై కేసులు నమోదు చేయడం జరిగిందని ఎక్సైజ్ సీఐ శ్రీనుబాబు తెలిపారు.