ఏలూరు జిల్లా కలెక్టరేటు గోదావరి సమావేశ మందిరంలో ఇవాళ జిల్లా స్థాయి ప్రజాసమస్యలు పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లాస్థాయి అధికారులతో జిల్లా కలెక్టరు కె. వెట్రిసెల్వి నిర్వహించారు. ప్రజల నుంచి వచ్చిన 352 ఫిర్యాదులు పరిష్కారానికి అధికారులు అత్యంత బాధ్యత తీసుకోవాలన్నారు. ఫిర్యాదులు పరిష్కారంలో అలసత్వం వహించే అధికారులపై శాఖపరమైన చర్యలు తప్పవన్నారు.