KRNL: పెద్దకడబూరు మండలంలోని నౌలేకల్ గ్రామ ZPHS క్రీడా మైదానంలో పేరుకుపోయిన ముళ్ల కంపలను సోమవారం జేసీబీ సహాయంతో తొలగించారు. మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేంద్రారెడ్డి సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు నరసింహులు, మానప్ప, నగేశ్, వీరేశ్, బసప్ప, రాజు పాల్గొని పాఠశాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని తెలిపారు.