HYD: GHMC వార్డుల విభజనపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ తెలంగాణ హైకోర్టులో మరిన్ని లంచ్ మోషన్ పిటిషన్లు దాఖలయ్యాయి. తమ విన్నపాలను పరిగణనలోకి తీసుకోకుండానే వార్డుల విభజన చేశారని పలువురు పిటిషన్లలో పేర్కోన్నారు. ఇప్పటికే వార్డుల మ్యాప్, జనాభా వివరాలను బహిర్గతం చేయాలని కోర్టు ఆదేశించగా, తాజాగా మరికొన్ని డివిజన్ల పిటిషన్లను న్యాయస్థానం విచారణకు స్వీకరించింది.