PLD: సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ సోమవారం విశాఖపట్నంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలాన్ని సందర్శించారు. సింహాద్రి అప్పన్నస్వామిని దర్శించుకున్న ఆయన, ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవస్థాన అధికారులు కన్నాను సన్మానించి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. అనంతరం భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావును కలిశారు.