MDK: ప్రజావాణి ఫిర్యాదులపై తక్షణ పరిష్కారం కోసం చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అధికారులను సూచించారు. మెదక్ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజావాణిలో ప్రజల నుంచి సమస్యలపై దరఖాస్తులను స్వీకరించారు. ఈ మేరకు ఎస్పీ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని సంబంధిత అధికారులతో మాట్లాడి తక్షణమే పరిష్కరించాలన్నారు.