ADB: ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన ఏసుక్రీస్తు బోధనలు ఆచరణీయమని MLA అనిల్ జాదవ్ పేర్కొన్నారు. సోమవారం బోథ్ మండలంలోని నిర్వహించిన ముందస్తు క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొని కేకు కట్ చేసి పంచారు. ప్రపంచంలోనే క్రైస్తవులందరూ సోదర భావంతో కలిసిమెలిసి ఒకేరోజు పండుగను నిర్వహించుకోవడం గొప్ప విషయం అన్నారు. ఆయన చూపిన మార్గంలో ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు.