KNR: పంచాయతీలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పంచాయతీ నూతన పాలకవర్గాలకు కోరారు. సోమవారం తిమ్మాపూర్ మండలంలోని మహాత్మానగర్, తిమ్మాపూర్, నుస్తులాపూర్, పోరండ్ల, పోలంపల్లి, నర్సింగాపూర్ గ్రామ పంచాయతీ పాలకవర్గాల ప్రమాణ స్వీకారోత్సవాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.