ADB: మావల మండలంలోని కొమరంభీం కాలనీలో నివసిస్తున్న ఆదివాసీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 23న పట్టణంలోని కలెక్టర్ కార్యాలయం ముందు మహాధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని గోడం గణేష్ తెలిపారు. సోమవారం ఆదివాసీ తుడుందెబ్బ నాయకులతో సమావేశమై మాట్లాడారు. కాలనీలో విద్యుత్, త్రాగునీరు, రోడ్డు సౌకర్యం, ఇళ్ల పట్టాలు అందజేయాలని అధికారులను కోరారు.