పిన్కోడ్ అంటే పోస్టల్ ఇండెక్స్ నంబర్. ఇది దేశంలోని తపాలా వ్యవస్థను సులభతరం చేయడానికి రూపొందించబడింది. పిన్కోడ్లోని మొదటి అంకె లేఖను పంపించాల్సిన పోస్టల్ జోను సూచిస్తుంది. రెండవ అంకె రాష్ట్రాన్ని, మూడవ అంకె జిల్లాను సూచిస్తుంది. చివరి మూడు అంకెలు ప్రాంతీయ తపాలా కార్యాలయ కోడ్ను సూచిస్తాయి. ఈ విధానాన్ని 1972లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది.