KDP: వల్లూరు మండలం గణేష్పురం సమీపంలో కడప–తాడిపత్రి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. కమలాపురం నుంచి కడప వైపు వెళ్తున్న బైక్ అకస్మాత్తుగా అడ్డు వచ్చిన పందిని ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు స్వల్పంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే వారిని సమీప ఆసుపత్రికి తరలించగా.. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.