TG: తెలంగాణకు బీజేపీ ఎంపీలు ఏం చేశారో చెప్పేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు చర్చకు రావొచ్చని సవాల్ విసిరారు. పదేళ్ల పాలనలో కేసీఆర్ మొత్తం దోచుకున్నారని విమర్శించారు. పాలమూరుకు అన్యాయం చేసింది కేసీఆరే అని మండిపడ్డారు. త్వరలో BRSకు ప్రజలు చరమగీతం పాడుతారని జోస్యం చెప్పారు.