JGL: కథలాపూర్ మండలం భూషణరావుపేట జడ్పీ హైస్కూల్‌కు చెందిన శ్రీవర్షిని జాతీయస్థాయి ఖో-ఖో పోటీలకు ఎంపికైనట్లు పీడీ నవీన్ కుమార్ తెలిపారు. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో జరిగే జాతీయ స్థాయి ఖో-ఖో పోటీల్లో శ్రీవర్షిని తెలంగాణ జట్టు తరఫున పాల్గొంటుందని ఆయన పేర్కొన్నారు. విద్యార్థిని శ్రీవర్షినిని హెచ్ఎం రాజయ్య అభినందించారు.