AP: సినీ పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తున్నామని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. సినిమా ప్రోత్సాహకంపై ఎల్లుండి నేతల సమావేశం నిర్వహించి అందులో సినిమా టికెట్ రేట్ల పెంపుపై చర్చిస్తామని తెలిపారు. ఉగాది నాటికి నంది అవార్డులు, నంది నాటకోత్సవాలను నిర్వహించాలని ఆలోచనలో ఉన్నామన్నారు. APలో షూటింగ్ చేసుకున్న సినిమాలకు మరింత ప్రోత్సాహం అందిస్తామని చెప్పారు.