NDL: అంగన్వాడీ కేంద్రాల పనితీరును మెరుగుపరిచేందుకు ఎమ్మెల్యే కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి సోమవారం టీచర్లకు సెల్ ఫోన్లను పంపిణీ చేశారు. సాంకేతికతతో సేవలు మరింత వేగంగా, నాణ్యంగా అందుతాయని ఆయన పేర్కొన్నారు. పిల్లల ఆరోగ్యం, పోషణ విషయంలో అంగన్వాడీల పాత్ర కీలకమన్నారు. ఈ కార్యక్రమంలో సీడీపీవో, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.