E.G: రాజమండ్రి శివారు ప్రాంతాల అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు MLA ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. 49వ డివిజన్ సుబ్బారావు నగర్ మున్సిపల్ పాఠశాల వద్ద రూ. 22 లక్షలతో చేపట్టనున్న డ్రైనేజీ అభివృద్ధి పనులకు సోమవారం ఆయన శ్రీకారం చుట్టారు. ప్రజా అవసరాలను గుర్తించి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.