KDP: ఖాజీపేట (M) నాగపట్నం సమీపంలో సుంకేసుల గ్రామానికి చెందిన చెన్నూరు శివప్రసాద్ రెడ్డి విద్యుత్ షాక్కు గురై సోమవారం మృతి చెందాడు. ఈయన నాగపట్నం సమీపంలో చేపట్టిన ఇంటి నిర్మాణ పనికి బేల్దారిగా వెళ్లారు. ఈ క్రమంలో విద్యుత్ షాక్కు గురైన అతడిని.. వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకెళ్తుండగా.. మార్గమద్యంలో మృతి చెందాడు. పోస్టుమార్టం నిమిత్తం కడప రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.