VZM: విజయనగరం పీటీసీలో 478 మంది స్టైఫెండరీ క్యాడెట్ ట్రైనీ మహిళా కానిస్టేబుల్స్ శిక్షణ సోమవారం ప్రారంభమైంది. 9 నెలల ప్రాథమిక శిక్షణను విశాఖపట్నం మెట్రోపాలిటన్ సిటీ పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి ప్రారంభించారు. శిక్షణ కాలంలో క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచిస్తూ, సమాజంలో పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టడంలో పోలీసుల పాత్ర అత్యంత కీలకమన్నారు.