ATP: విద్యుత్ సమస్యల సత్వర పరిష్కారానికి ఏపీఎస్పీడీసీఎల్ శ్రీకారం చుట్టిన “కరెంటోళ్ల జనబాట” పోస్టర్ను కలెక్టర్ ఓ.ఆనంద్ సోమవారం ఆవిష్కరించారు. ప్రతి మంగళ, శుక్రవారాల్లో అధికారులు గ్రామాల్లో పర్యటించి వేలాడే తీగలు, వంగిన స్తంభాలను సరిచేయాలని ఆదేశించారు. నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు.