W.G: భారతరత్న మాజీ ప్రధాని అటల్ బీహారి వాజ్పేయి శత జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఇవాళ భీమవరానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయనకు నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం వాజ్ పేయి విగ్రహాన్ని ఆయన కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మతో కలిసి ఆవిష్కరించారు.