ATP: పీఎం సూర్య ఘర్ పథకం కింద జిల్లాలోని రాప్తాడు, నార్పల, యాడికి, ఉరవకొండ, కంబదూరు గ్రామాలను మోడల్ సోలార్ గ్రామాలుగా ఎంపిక చేసినట్లు కలెక్టర్ ఓ. ఆనంద్ తెలిపారు. సోమవారం అనంతపురంలోని కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఈ గ్రామాల్లో రేపటి నుంచే సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.