కృష్ణా: చెల్లని చెక్కు కేసులో నిందితుడిపై నేరం రుజువుకావడంతో మచిలీపట్నం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి పీ.సాయిసుధ నిన్న తీర్పు వెల్లడించారు. పోలీసుల వివరాలు.. బలరామునిపేటకు చెందిన J.వెంకటేశ్వరరావు వద్ద నుంచి కరగ్రహారానికి చెందిన J.నాగమహాలక్ష్మయ్య అప్పు తీసుకుని చెక్కు ఇచ్చారు. అది బౌన్స్ కావడంతో కేసు నమోదైంది. విచారణ అనంతరం నిందితుడికి 6 నెలల జైలు శిక్ష విధించారు.