KNR: మూడు రోజుల విరామం తర్వాత జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ ఈరోజు ప్రారంభమైంది. కాగా, పత్తి ధర స్వల్పంగా తగ్గిందని వ్యాపారస్తులు పేర్కొన్నారు. మార్కెట్కు 43 వాహనాల్లో 278 క్వింటాళ్ల పత్తి విక్రయానికి రాగా, గరిష్ఠంగా క్వింటాకు రూ.7,400, కనిష్ఠంగా రూ.7,000 ధర పలికింది. గత వారం కంటే ధర రూ. 50 తగినట్లు మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి రాజా తెలిపారు.