E.G: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా కొవ్వూరు మండలం కాపవరం గ్రామానికి చెందిన అమర్జహ బేగ్ మహమ్మద్ నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు అందాయన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకి, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, తదితర ప్రజా నాయకులకు ఈ సందర్భంగా ఆమె కృతజ్ఞతలు తెలిపారు.