పాక్ చేతిలో భారత్ 191 రన్స్ తేడాతో మెన్స్ U19 ఆసియా కప్ ఫైనల్ ఓడిన సంగతి తెలిసిందే. టోర్నీ ఆద్యంతం అజేయంగా రాణించిన యువ భారత్ టైటిల్ పోరులో చేతులెత్తేయడం ఆశ్చర్యపరిచింది. ఈ నేపథ్యంలో ఓటమి, యువ ఆటగాళ్ల ఆటతీరుపై టీమ్ మేనేజ్మెంట్, కెప్టెన్ ఆయూష్ మాత్రే నుంచి వివరణ కోరాలని BCCI నిర్ణయించింది. కాగా జింబాబ్వే, నమీబియా వేదికగా జనవరి 15 నుంచి U19 వరల్డ్ కప్ జరగనుంది.