W.G: అన్నవరం సత్యనారాయణ స్వామి సామూహిక వ్రతాల్లో భక్తుల నుంచి అదనంగా డబ్బులు వసూలు చేసిన ఆరుగురు వ్రత పురోహితులపై వేటు పడింది. ఈ నెల 21న పాలకొల్లులో నిర్వహించిన వ్రతాల్లో ఈ అక్రమాలు జరిగినట్లు తేలడంతో ఈవో త్రినాథరావు ఈ చర్యలు తీసుకున్నారు. ఒక గుమస్తాకు నోటీసు జారీ చేశారు. మంత్రి రామానాయుడు సిఫార్సుతో ఈ వ్రతాలు జరిగిన విషయం తెలిసిందే.