MBNR: బంగ్లాదేశ్లో దీపు చంద్ర దాస్ హత్యను నిరసిస్తూ.. వెన్నచేడ్లో యువజన సంఘాలు భారీగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించాయి. అల్లరి మూకల దాడిలో ఆయన మృతి చెందడంపై యువత ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. నివాళులర్పించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని, హిందువుల రక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ యువత పెద్ద సంఖ్యలో పాల్గొని నిరసన తెలిపారు.