KRNL: లాభాలకే పరిమితం కాకుండా సమాజానికి తిరిగి ఇవ్వడమే కార్పొరేట్ సంస్థల నిజమైన సామాజిక బాధ్యత అని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి వెంకట శేషాద్రి అన్నారు. న్యాయసేవ సదన్‌లో కార్పొరేట్ సంస్థల సామాజిక బాధ్యత (CSR) నిధులపై అవగాహన సదస్సు నిర్వహించారు. విద్య, ఆరోగ్యం, వికలాంగుల సంక్షేమం వంటి రంగాల్లో CSR నిధులు వినియోగించాలని సూచించారు.