KKD: ఏలేశ్వరం మండలంలోని యర్రవరం విద్యుత్ ఉపకేంద్రంలో మంగళ, బుధవారాల్లో నిర్వహణ పనులు జరుగుతాయని ఈఈ బి. వీరభద్రరావు తెలిపారు. ఈ కారణంగా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పలు గ్రామాలకు విద్యుత్ సరఫరా ఉండదన్నారు. యర్రవరం, తిరుమాలి, పేరవరం, చిన్నింపేట, సిరిపురం గ్రామాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని.. వినియోగదారులు తమకు సహకరించాలని కోరారు.