TG: రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు మరో గుడ్న్యూస్ చెప్పనుంది. మహిళా సంఘాల ఆర్థిక సాధికారతే లక్ష్యంగా ఇందిరా మహిళా శక్తి పథకం కింద విజయ డెయిరీ పార్లర్లను కేటాయించేందుకు సిద్ధమైంది. మండలానికి ఒకటి, మున్సిపాలిటీల్లో రెండు చొప్పున మహిళా సంఘాలకు పార్లర్లు కేటాయించనున్నారని సమాచారం. ఒక్కో పార్లర్ ఏర్పాటుకు రూ.5 లక్షల వరకు ఖర్చు అవుతుండగా, ప్రభుత్వం రుణాలను సైతం అందించనుంది.