KDP: బి.కోడూరు క్రాస్ రోడ్ వద్ద ముందు వెళ్తున్న ఆటోను బైక్ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో బైక్ పై ప్రయాణిస్తున్న వ్యక్తి తలకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది అతడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వ్యక్తి బి. కోడూరు మండలం రామచంద్రాపురంకి చెందిన యాదగిరిది అని సమాచారం.