KNR: మాదక ద్రవ్యాల వాడకం నిర్మూలించేందుకు, జిల్లాలో అనుమానిత ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పోలీస్, ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు. నార్కో కోఆర్డినేషన్ సెంటర్ కమిటీ సమావేశాన్ని కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. పోలీస్, ఎక్సైజ్, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమంపై చర్చించామన్నారు.