టీమిండియా క్రికెటర్ శార్దుల్ ఠాకూర్ తండ్రయ్యాడు. ఆయన భార్య మిథాలీ నిన్న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని శార్దుల్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. దీంతో సహచర క్రికెటర్లు, అభిమానులు ఆ దంపతులకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా, శార్దుల్ వచ్చే ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించబోతున్నాడు.