ములుగు: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ మల్లేశం ఆధ్వర్యంలో జాతీయ గణిత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గణిత పితామహుడు శ్రీనివాస రామానుజన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, అధ్యాపక బృందం పాల్గొన్నారు.