KRNL: మంత్రి నారా లోకేశ్‌ను హైదరాబాదులోని నివాసంలో మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేంద్రారెడ్డి సోమవారం కలిశారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయంలో ఆర్టీసీ బస్టాండ్ అభివృద్ధికి, అండర్ డ్రైనేజీ నిర్మాణానికి నిధులు విడుదల చేయాలని మంత్రిని కోరారు. 2009లో మంత్రాలయంలో వచ్చిన వరదలను గుర్తుచేసి ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.