W.G: అంగన్వాడి కేంద్రాల్లో మరిన్ని మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ కోరారు. ఇవాళ స్థానిక కూటమి కార్యాలయంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో అంగన్వాడీలకు 5జి సెల్ ఫోన్లను అందజేశారు. తణుకు నియోజవర్గంలో 251 మందికి ఫోన్లు అందజేసినట్లు చెప్పారు. ప్రభుత్వం కల్పిస్తున్న సేవలను వినియోగించుకొని మరిన్ని సేవలు అందించాలని కోరారు.