NGKL: గత కేసీఆర్ ప్రభుత్వం పాలమూరు ప్రాజెక్టులను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని మంత్రి జూపల్లి సోమవారం ఆరోపించారు. కాలువలు పూర్తి కాకుండానే పాలమూరు-రంగారెడ్డి పథకాన్ని జాతికి అంకితం చేశారని విమర్శించారు. పదేళ్ల పాలనలో ఒక్క ఎకరానికి నీరివ్వలేకపోయారని, కేవలం ఆర్భాటాలకే ప్రాధాన్య మిచ్చారని మంత్రి మండిపడ్డారు.