ASR: డుంబ్రిగుడ మండలం కొర్రాయి పంచాయతీలో రహదారికి ఇరువైపుల గుబురుగా పెరిగిన తుప్పలను తొలగించే కార్యక్రమం సోమవారం చేపట్టారు. తుప్పలు తొలగింపు పనులను పంచాయతి సర్పంచ్ పూజారి కొములు దగ్గరుండి పర్యవేక్షించారు. అరకు గ్రామం నుండి కొల్లాపుట్టు పంచాయతీ సరిహద్దు వరకు రహదారికి ఇరువైపుల ఉన్న తుప్పలను తొలగించారు. తుప్పలు తొలగించడంతో వాహన ప్రమాదాలు అరికట్టవచ్చన్నారు.