GNTR: గంజాయి కేసులో 17 సంవత్సరాల బాలుడిని అరెస్ట్ చేసినట్లు DSP భానోదయ తెలిపారు. గుంటూరు DSP కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. కాకుమాను-అప్పాపురం రోడ్డులో వాహనాల తనిఖీ చేస్తుండగా ఆటోలోని వ్యక్తి పారిపోయాడని, బాలుడిని అరెస్టు చేసినట్లు తెలిపారు. అతని వద్ద నుంచి 3.5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.