మెగాస్టార్ చిరంజీవి, మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ కలిసి ఒకే చిత్రంలో నటించబోతున్నారు. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మెగా 158’ చిత్రంలో మోహన్ లాల్ ఒక కీలక పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. గతంలో చిరు-బాబీ కాంబోలో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో, ఈ ‘మెగా 158’ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.